‘ఫాదర్స్ డే’ ఎలా మొదలైంది? వెనకున్న ఎమోషనల్ స్టోరీ తెలుసా?
- ఓ కుమార్తె ఆలోచనతో ఫాదర్స్ డే ప్రారంభం
- మదర్స్ డేలో పాల్గొన్న సోనోరా స్మార్ట్
- తల్లి లేని తమను పెంచిన తండ్రి కోసం కూడా వేడుక చేయాలని ఆలోచన
- 1910లో తొలి ఫాదర్స్ డే వేడుక
- అమెరికా అధ్యక్షుల మద్దతుతో 1972లో అధికారిక గుర్తింపు
కుటుంబం కోసం తన కోరికలను పక్కన పెట్టి, పిల్లల భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా శ్రమించే వ్యక్తి తండ్రి. ఆయన ప్రేమ ఎక్కువగా మాటల్లో కనిపించకపోయినా.. ప్రతి నిర్ణయంలో, ప్రతి త్యాగంలో, ప్రతి బాధ్యతలో కనిపిస్తుంది. అలాంటి తండ్రుల సేవలను గుర్తు చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా జూన్ మూడో ఆదివారం జరుపుకొనేదే ‘ఫాదర్స్ డే’. అయితే ఇప్పుడు కోట్లాది మంది జరుపుకొంటున్న ఈ ప్రత్యేక రోజు వెనుక ఓ కుమార్తె ప్రేమ, కృతజ్ఞత దాగి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.
ఓ కుమార్తె మనసులో పుట్టింది
ఫాదర్స్ డే కథ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ప్రారంభమైంది. సోనోరా స్మార్ట్ డాడ్ అనే యువతికి 1909లో మదర్స్ డే వేడుకలో పాల్గొన్న సమయంలో ఓ ఆలోచన తట్టింది. తల్లుల కోసం ప్రత్యేక రోజు ఉంటే, తన జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేసిన తండ్రుల కోసం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించుకుంది. అదే తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘ఫాదర్స్ డే’గా మారింది.
ఆ తండ్రి కథే ప్రపంచానికి స్ఫూర్తి
సోనోరా తండ్రి విలియమ్ జాక్సన్ స్మార్ట్ మాజీ సైనికుడు. భార్య మరణించిన తర్వాత ఆరుగురు పిల్లలను ఒంటరిగా పెంచాడు. ఆ కాలంలో అది సాధారణ విషయం కాదు. కుటుంబ బాధ్యతలన్నీ భుజాన వేసుకుని పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నాడు. తన తండ్రి జీవితాన్ని దగ్గరగా చూసిన సోనోరా.. ఆయనలాంటి తండ్రులందరికీ గౌరవం దక్కాలని కోరుకుంది.
చిన్న కార్యక్రమం నుంచి
సోనోరా ప్రయత్నాలకు స్థానిక మత పెద్దలు, సామాజిక నాయకులు మద్దతు ఇవ్వడంతో 1910 జూన్ 19న అమెరికాలోని స్పోకేన్ నగరంలో తొలి ఫాదర్స్ డే నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. తండ్రులను సన్మానించారు. అక్కడ మొదలైన ఆ ఆలోచన క్రమంగా అమెరికా అంతటా వ్యాపించింది.
అధికారిక గుర్తింపు కోసం
‘ఫాదర్స్ డే’కు అమెరికా అధ్యక్షులు వుడ్‌రో విల్సన్, కాల్విన్ కూలిడ్జ్ వంటి నాయకులు మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ అధికారిక గుర్తింపు రావడానికి చాలా కాలం పట్టింది. చివరకు 1972లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఫాదర్స్ డేను జాతీయ వేడుకగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జూన్‌లో మూడో ఆదివారం ‘ఫాదర్స్ డే’ను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఫాదర్స్ డేను నిర్వహించుకుంటున్నాయి. బహుమతులు, శుభాకాంక్షలు, కుటుంబ సమయం ఇవన్నీ ఈ రోజులో భాగమయ్యాయి. కానీ ఈ వేడుక వెనుక ఉన్న అసలు కథ మాత్రం ఒక కుమార్తె తన తండ్రికి చెప్పాలనుకున్న ‘ధన్యవాదాల’తో మొదలైందనేది మరువలేని విషయం.